हिन्दी | Epaper

Kamal Hassan: భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

Saritha
Kamal Hassan: భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

Kamal Hassan: వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా మూడోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు 86,824 మంది అభిమానుల మధ్య న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ చారిత్రక గెలుపుపై ప్రముఖ నటుడు, ఎంపీ కమల్ హాసన్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికరంగా స్పందించారు.

Read Also: Hardik Pandya: పదేళ్లలో 10 ట్రోఫీలే లక్ష్యం.. మహికా వల్లే ఇదంతా!

Kamal Hassan: భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు
Kamal Hassan: Kamal Haasan congratulates the Indian team

విజయంపై సంతోషం వ్యక్తం చేసిన టాలీవుడ్ ప్రముఖులు

టీమిండియా సాధించిన ఈ వరుస విజయాలు దేశంలోని రంజీ ట్రోఫీ నుంచి ఐపీఎల్ వరకు ఉన్న పటిష్టమైన క్రీడా వ్యవస్థకు నిదర్శనమని కమల్ హాసన్ కొనియాడారు. “క్రికెట్ లాగే మన దేశంలో ప్రతి క్రీడకూ ఇలాంటి అత్యుత్తమ దేశవాళీ వ్యవస్థ ఉంటే భారత్ ఎలాంటి అద్భుతాలు సాధిస్తుందో ఊహించుకోండి. మన యువతలోని ప్రతిభకు హద్దులు లేవు. గల్లీల నుంచి భారీ స్టేడియాల వరకు.. చిన్ననాటి కలల నుంచి ప్రపంచ ఛాంపియన్ల వరకు భారత్ సగర్వంగా ఎదుగుతోంది” అని ఆయన పోస్ట్ చేశారు. పురుషుల జట్టుతో పాటు మహిళల ప్రపంచకప్ గెలిచిన జట్టును కూడా ఆయన అభినందించారు. కమల్ హాసన్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్, మహేశ్ బాబు, వెంకటేశ్, రవితేజ, నితిన్ తదితరులు సైతం టీమిండియా అద్భుత ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు.

ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సంజూ శాంసన్ (46 బంతుల్లో 89) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత్ 255/5 అనే భారీ స్కోరు సాధించింది. ఇది టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు. ఆ తర్వాత బుమ్రా, అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్‌తో కివీస్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయగా.. ఆ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (52) మాత్రమే కాస్త పోరాడాడు. దీంతో భారత్ మరోసారి టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870