జవహర్‌నగర్ (Jawaharnagar) రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో (Jawaharnagar Businessman Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. వ్యాపారి హత్యకు కారణమైన వారిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ఒక మైనర్ బాలుడుతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. జవహర్‌నగర్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి రత్న కుమార్‌ను కాల్చి, కత్తులతో పొడిచి చందన్ సింగ్ (25) చంపేశాడు.
Read Also: Ramachandra Rao: రాజకీయ స్వలాభం కోసమే జిహెచ్ఎంసీ విస్తరణ

హత్యకు పగ కారణం: వెలుగులోకి సంచలన విషయాలు
హత్యకు ప్రధాన కారణం పగ అని విచారణలో తేలింది. నిందితుడు చందన్ సింగ్ తన తండ్రి ఎన్‌కౌంటర్‌కు రత్న కుమార్ కారణమని భావించి, అతనిపై ప్రతీకారం పెంచుకున్నాడు. ఈ ప్రతీకారం తీర్చుకోవడానికి చందన్ సింగ్ ఒక మైనర్ బాలుడు సహాయంతో రత్న కుమార్ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు. ఆ తర్వాత జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) బాయ్స్ రూపంలో కొందరిని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటికి పంపించి సమాచారం సేకరించాడు.
పట్టుబడిన నిందితులు: ఆయుధాల స్వాధీనం
రత్న కుమార్ తన పాపను స్కూల్లో వదిలి ఇంటికి వెళ్తున్న సమయంలో చందన్ సింగ్ అతన్ని కాల్చి చంపేశాడు. మైనర్ బాలుడుతో పాటు చందన్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. చందన్ సింగ్ వద్ద నుంచి ఒక రివాల్వర్, 15 రౌండ్ల బుల్లెట్స్, కత్తులను జవహర్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: