జనసేన పార్టీ (Janasena Party) కి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఈ విషయాన్ని జనసేన సోషల్ మీడియా గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ అకౌంట్‌లో పార్టీ కార్యకలాపాలకు సంబంధం లేని ఇన్వెస్ట్‌మెంట్స్, క్రిప్టో ట్రేడింగ్స్ వంటి పోస్టులు దర్శనమిస్తున్నాయి.
Read Also: AP: యూట్యూబ్ ప్రభావం.. అత్తను చంపిన కోడలు
పార్టీ అఫీషియల్ హ్యాండిల్ హ్యాక్ కావడం
పార్టీ కార్యకలాపాలు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధికారిక కార్యక్రమాల పోస్టులు కనిపించేవి.పార్టీ (Janasena Party) వర్గాలు సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పార్టీ అఫీషియల్ హ్యాండిల్ హ్యాక్ కావడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇటీవలి కాలంలో ప్రముఖ రాజకీయ నాయకుల, సంస్థల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, “ఇలాంటి దాడులు డేటా చోరీ కోసం జరుగుతుంటాయి. ట్విట్టర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (Two-factor authentication) తప్పనిసరి చేయాలి” అని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: