హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట(Jagadgirigutta) భవానినగర్ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలు(New Year celebrations) విషాదంగా మారాయి. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించేందుకు కలిసి వేడుకలు జరుపుకున్న యువకుల బృందంలో ఒక్కసారిగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి.
Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు

మద్యం సేవించి బిర్యాని తిన్న తర్వాత కాసేపటికే 17 మందిలో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అస్వస్థతకు గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆహారంలో లేదా మద్యంలో కలుషితం ఉందా? లేక విషపదార్థాలు కలిసాయా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: