పైరసీ సైట్ ‘ఐబొమ్మ(Ibomma)’ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన ఇమ్మడి రవి(IMMADI RAVI)ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ బృందం మరోసారి కస్టడీలోకి తీసుకుంది. మూడు రోజులపాటు అతడిని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో, విచారణను ఈరోజు నుంచే ప్రారంభించారు.
Read Also: iBomma Case: రవిపై ఐదు కేసులు.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

ఐదు రోజులపాటు అతడిని కస్టడీలో
కొద్ది రోజుల క్రితం రవిని అరెస్టు చేసిన పోలీసులు, కోర్టు(Court) ఆదేశాల మేరకు ఐదు రోజులపాటు అతడిని కస్టడీలో ఉంచి కీలక సమాచారం సేకరించారు. అయితే అతడి బ్యాంక్ లావాదేవీలు, పరపతి నెట్‌వర్క్, అక్రమ ఆదాయం ప్రవాహం వంటి అంశాలపై పూర్తివివరాలు ఇంకా దొరకలేదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఈ కారణంగా మరోసారి కస్టడీ అవసరమని పోలీసులు(polices) న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయగా, కోర్టు మూడు రోజుల కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలు నుంచి అతడిని సైబర్ క్రైమ్ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. రవికి ఉన్న నెట్‌వర్క్ పరిమాణం, ఆర్థిక లింకులు, పైరసీని నిర్వహించిన విధానంపై దర్యాప్తు కొనసాగుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: