TG లో ఎంతోకాలంగా సైబర్ క్రైమ్ విభాగానికి సవాల్‌గా మారిన iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి చివరికి పోలీసులు అరెస్టు చేయడంతో, ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ iBomma ద్వారా కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది, HYD సైబర్ క్రైమ్ పోలీసులు నెలల తరబడి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతమైంది.
Read Also: TG Govt: ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వారికి సర్కార్ షాక్

రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుంది
ఈ విజయాన్ని రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక సీఎస్ సీవీ ఆనంద్ సైబర్ క్రైమ్ టీమ్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.‘‘జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని iBomma తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుంది. ‘దమ్ముంటే పట్టుకోండి’ అని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేసింది. DCP కవిత, CP సజ్జనార్‌కు కంగ్రాట్స్’’ అని ట్వీట్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: