గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో రవి(I Bomma) పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. పైరసీ వెబ్ సైట్ ఐ బొమ్మ ను సంవత్సరాలు తరబడి నడిపించిన రవి ఇటీవల హైదరాబాద్(Hyderabad) సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కరేబియన్ దీవుల్లో దాగి ఈ సైట్‌ను రహస్యంగా నిర్వహిస్తున్నట్టు సమాచారం. IBomma లో “I” అంటే రవి ఇంటి పేరు ఇమ్మాడి నుండి తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రవి పూర్తి పేరు ఇమ్మాడి రవి. ఇమ్మాడి నుండి “I” తీసుకొని, సినిమాలను బొమ్మ గా సూచించడంతో వెబ్ సైట్ పేరు బొమ్మ గా మారింది.
పోలీసుల దర్యాప్తులో రవి పైరసీ వెబ్ సైట్ ద్వారా కోట్లు సంపాదించాడని తెలిసింది. రవి తన భార్య, అత్తల కారణంగా ఈ మార్గంలోకి వెళ్ళాడని తన ఇంటర్వ్యూలో వివరించాడు. మధ్యతరగతి జీవితం కొనసాగించేవాడు, కానీ భార్య లగ్జరీ జీవితం కోసం ఆరాటపడటం, డబ్బులు సరిపోవకపోవడం వల్ల వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
Read also: మరో కీలక మార్పు: బేసిక్ శాలరీ లిమిట్ రూ.25,000కి పెంపు దిశగా

సోషల్ మీడియాలో రవి కేసు వివాదాస్పదంగా మారింది
ఈ సైబర్ నేరంలో రవి(I Bomma) తన కంప్యూటర్ నైపుణ్యాన్ని ఉపయోగించి ఐ బొమ్మను సృష్టించి, సినిమాలను అప్‌లోడ్ చేసి ప్రమోషన్ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం పొందాడు. ఒక నెలలో 80 లక్షల వరకు సంపాదించి కొద్ది కాలంలో లక్షల నుంచి కోట్ల వరకు డబ్బు సంపాదించాడు. పోలీసుల ప్రకారం ఆయన దగ్గర 25,000కి పైగా సినిమాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు ఉన్నాయి.
రవి కేసు సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. కొందరు అతనిని ఖండిస్తున్నా కొందరికి ఫ్రీలో సినిమాలు చూడటంలో ఆనందాన్ని ఇచ్చిన కారణంగా ఆయన ఒక హీరోగా భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే డేటా సేఫ్టీ, కాపీ రైట్, చట్టపరమైన సమస్యల కారణంగా రవి చర్య తప్పు అని పోలీసులు పేర్కొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :