హైదరాబాద్(Hyderabad) నగరంలోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికను ఆమె తల్లే అపార్ట్‌మెంట్ పై నుంచి కిందకు తోసివేయడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
Read also: Accident: పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి?
మానసిక సమస్యలే కారణమా?.. హైదరాబాద్‌లో తల్లి ఘాతుకం
మల్కాజిగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృత బాలిక కుటుంబం గత రెండు దశాబ్దాలుగా వసంతపురి కాలనీలో నివసిస్తోంది. బాలిక తండ్రి ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, తల్లి మానసిక ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా తల్లి తన కుమార్తెను మూడంతస్తుల భవనం పై నుంచి తోసివేసినట్లు తెలుస్తోంది. కింద ఉన్న మెట్లపై పడటంతో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)కి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతున్న సమయంలోనే బాలిక మృతి(Die) చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. బాలిక తల్లి మానసిక సమస్యలతో బాధపడుతున్న అంశాన్ని పోలీసులు కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: