ఇటీవల హైదరాబాద్లో (Hyderabad) కురిసిన భారీ వర్షాలకు వరదల్లో గల్లంతైన ముగ్గురి వ్యక్తుల ఆచూకీలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మల్లేపల్లి అఖ్తల్ సాగర్ కాలనీలో నివాసం ఉండే అర్జున్, రాము వరుసకు మామ, అల్లుళ్లు. వీరిద్దరిలో నల్గొండలోని మూసీనది (Musi River)లో అర్జున్ మృతదేహాన్ని సహాయక సిబ్బంది కొనుగొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి బయలుదేరారు. మరొకరి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నిద్రలోనే మృత్యువడిలోకి..
మల్లేపల్లి అర్జీల్ సాగర్ కాలనీ (Arjeel Sagar Colony) లో నివాసం ఉండే అర్జున్, రాము వరుసకు మామ, అలుళ్లు. రోజులాగే ఇంటి బయట మంచాలపైపడుకున్న రాము, అర్జున్ లు ఆకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల నాలాలో పడిపోయి గల్లంతు అయ్యారు. రాముకు నలుగురు,అర్జున్ కు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పటిదాకా ఎక్కడో ఒకచోట ప్రాణాలతో ఉంటారనే ఆశతో ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులకు అర్జున్ మృతదేహం లభ్యంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కుటుంబ సభ్యులకుసమాచారం ఇవ్వగానే
హృటావుటిగా నల్గొండలోని మూసీనది వద్దకు,బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే అర్జున్ (Arjun) మృతదేహాన్ని సహాయక సిబ్బంది కొనుగొన్నారు. తద్వారా కుటుంబ సభ్యులకుసమాచారం ఇవ్వగానే వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాము కోసం ఎదురుచూస్తున్నారు. సహాయక సిబ్బంది రాము, గురించికూడా అన్వేషణ కొనసాగిస్తున్నారు.
ఇక ముషీరాబాద్ లోని వినోబానగర్ ప్రాంతానికి చెందిన దినేష్ ఒక అనాధ,యువతిని ప్రేమ వివాహం చేసుకోగా వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నారు. దినేష్ స్నేహితుడి ఇంటి దగ్గరకి వెళ్లి, బైక్ను పార్క్ చేస్తుండగా నాలా గోడ కూలి,వరదలోకొట్టుకుపోయాడు. ఇతని అచూకీ కూడా ఇంకా లభ్యం కాలేదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: