హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్‌లో ఉన్న కో లివ్ గెర్నట్ పీజీ కో-లివింగ్ హాస్టల్‌లో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇద్దరు డ్రగ్స్ సరఫరాదారులు, ముగ్గురు డ్రగ్స్ వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో నిందితుల వద్ద నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్‌తో పాటు ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Read also: Medipalli crime: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చింది..

Drugs supplied at a co-living hostel
ప్రాథమిక విచారణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వంశీ దిలీప్, బాల ప్రకాశ్‌లు డ్రగ్స్ సరఫరాదారులుగా, హైదరాబాద్‌కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్‌లు వినియోగదారులుగా పోలీసులు గుర్తించారు. నిందితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన అనంతరం తదుపరి విచారణ కోసం వారిని రాయదుర్గం పోలీసులకు ఎస్‌వోటీ అధికారులు అప్పగించారు. కో-లివింగ్ హాస్టల్స్‌ను కేంద్రంగా చేసుకుని యువతను లక్ష్యంగా మత్తు పదార్థాల సరఫరా జరుగుతున్న అంశంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: