Hyderabad crime: అనుకోని ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. టిఫిన్ తింటుండగా బోండా గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఒక లారీ డ్రైవర్ మృతి(Death) చెందిన ఘటన యూసుఫ్‌గూడ పరిధిలో కలకలం రేపింది.
Read Also: AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

అసలేం జరిగింది?
పోలీసుల వివరాల ప్రకారం.. రహ్మత్‌నగర్ ఎస్.పి.ఆర్ హిల్స్‌కు చెందిన దాసరి రమేష్ (45) వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో యూసుఫ్‌గూడ శ్రీకృష్ణదేవరాయనగర్ సమీపంలోని ఒక టిఫిన్ సెంటర్ వద్ద బోండాలు తింటున్నాడు.
ఆ సమయంలో ప్రమాదవశాత్తు బోండా ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఒక్కసారిగా ఊపిరాడక రమేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అర్ధరాత్రి కావడంతో ఎవరూ గమనించలేకపోయారు.
పోలీసుల దర్యాప్తు
శుక్రవారం ఉదయం స్థానికులు రమేష్ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రమేష్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం టిఫిన్ తింటూ ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: