హైదరాబాద్(Hyderabad Crime) నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరుతో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా బయటపడింది. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
Read Also: SriSathyaSai District: పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలకాపూర్ టౌన్‌షిప్(Alakapur Township)లో నివాసం ఉంటున్న 21 ఏళ్ల యువతి, మరో ఇద్దరు యువతులతో కలిసి ఓ గదిలో ఉంటోంది. ఈ నెల 1వ తేదీన ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో పర్వతాల రోహిత్ (23) అనే యువకుడు ఆమె గదిలోకి ప్రవేశించాడు. గత కొంతకాలంగా ఆమెను ప్రేమించాలని, తన ప్రేమను స్వీకరించాలని ఒత్తిడి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ రోజు కూడా అదే విషయం ప్రస్తావిస్తూ యువతిపై ఒత్తిడి చేయడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించి అరవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దీనితో ఆగ్రహం చెందిన యువకుడు కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: