हिन्दी | Epaper

News Telugu: Hyderabad Crime: వాట్సప్ డీపీతో 20,000 దోచుకున్న కేటుగాడు..

Rajitha
News Telugu: Hyderabad Crime: వాట్సప్ డీపీతో 20,000 దోచుకున్న కేటుగాడు..

హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల ధైర్యం పెరిగిపోతోంది. మేడ్చల్ కీసర పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా నటించిన ఓ కేటుగాడు, ట్రూ‌కాలర్‌లో ‘CI’గా పేరు మార్చుకుని, వాట్సప్‌లో పోలీస్ యూనిఫార్మ్ డీపీ పెట్టి బోగారం ప్రాంతంలోని పెట్రోల్ బంక్ మేనేజర్ హనుమంతును నమ్మబలికాడు. ‘‘ఇన్‌స్పెక్టర్‌కు అత్యవసరంగా ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపాలి’’ అని చెప్పి QR కోడ్ పంపి 20,000 రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. డబ్బులు పంపిన తర్వాత ఎవరూ రాకపోవడంతో హనుమంతుకు అనుమానం వచ్చి చివరకు కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Read also: Hyderabad Aquarium: రూ. 300 కోట్లతో భారీ టన్నెల్ అక్వేరియం

Hyderabad Crime

Hyderabad Crime

వాట్సప్ డీపీలు, ట్రూ‌కాలర్ ఐడీలు మార్చుకుని

కేసు నమోదు చేసిన పోలీసులు, డబ్బులు వెళ్లిన ఖాతా ఆధారంగా నిందితుడి కోసం దర్యాప్తు వేగవంతం చేశారు. ఇటీవల అధికారుల పేర్లు, వాట్సప్ డీపీలు, ట్రూ‌కాలర్ ఐడీలు మార్చుకుని మోసాలు చేసే ఘటనలు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి అధికారీ ఫోన్ ద్వారా డబ్బులు అడగరని స్పష్టం చేస్తూ, అనుమానాస్పద కాల్ వస్తే నేరుగా పోలీస్ స్టేషన్‌లో ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు. మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేస్తే డబ్బులు రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్కూల్ టీచర్ అనుమానాస్పద మృతి

స్కూల్ టీచర్ అనుమానాస్పద మృతి

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870