
హైదరాబాద్‌లోని(Hyd Crime) టోలీచౌకి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం నగరాన్ని కలిచివేసింది. జెప్టో సంస్థకు పనిచేస్తున్న అభిషేక్ (25) అనే డెలివరీ బాయ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోవడంతో, వెనుక నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సు అతడి తలపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు
ప్రాథమిక(Hyd Crime) సమాచారం ప్రకారం, నిర్ణీత సమయంలో డెలివరీ పూర్తి చేయాలనే ఆతురతతో అతడు అధిక వేగంతో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనతో వేగంగా డెలివరీ చేయాల్సిన నిబంధనలు డెలివరీ సిబ్బంది ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయా? అనే అంశంపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
స్థానికులు, రోడ్డు భద్రత నిపుణులు కంపెనీలు డెలివరీ టైమ్‌లపై ఒత్తిడి తగ్గించి ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ ఘటనతో 10 నిమిషాల డెలివరీ వంటి విధానాలు తప్పనిసరిగా ఉండాలా? అనే ప్రశ్న మరింత బలపడుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: