హుస్సేన్‌సాగర్ ఘటన.. 29 ఏళ్ల వివాహిత ఆత్మహత్య
TG: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్(Hussain Sagar) వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. పహాడీషరీప్ ప్రాంతానికి చెందిన వసంత (29) అనే వివాహిత సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉండగా, పెద్దవాడు నందు (7), చిన్నవాడు చెర్రీ (3½) గా గుర్తించారు.
Read also: Hanamkonda Accident: లారీ కింద పడ్డ వ్యక్తి.. అక్కడికక్కడే మృతి

భర్త మృతి తర్వాత ఒంటరి జీవితం..
నాలుగేళ్ల క్రితం భర్త లక్ష్మణ్ కామెర్ల వ్యాధితో మృతి చెందడంతో, అప్పటి నుంచి పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం తన ఇద్దరు కుమారులతో ట్యాంక్‌బండ్(Tankbund)కు వచ్చిన వసంత, వారిని అక్కడ కుర్చీలపై కూర్చోబెట్టి సెల్‌ఫోన్ ఇచ్చి ఆడుకుంటూ ఉండమని చెప్పింది. అనంతరం ఎవరూ గమనించని సమయంలో హుస్సేన్‌సాగర్‌లోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. చిన్నారులను ఆమె సోదరుడికి అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. భర్త మరణం తర్వాత ఎదురైన కుటుంబ, ఆర్థిక ఇబ్బందులే ఈ అఘాయిత్య నిర్ణయానికి దారితీసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలపై పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: