రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్యకేసు రోజురోజుకు మరింత మలుపులు తిరుగుతోంది. పెళ్లైన నెలలోపే భర్తను హత్య చేసి హవాలా వ్యవహారాల్లో కథ కేవలం ప్రేమ, ఘర్షణలకే పరిమితం కాదు అంతకుమించి క్రిమినల్ మైండ్ గేమ్ ఇది!
చిరిగిన రూ.10 నోటుతో మారిన దర్యాప్తు దిశ
ఇందోర్ నగరంలో దొరికిన ఓ చిరిగిన రూ.10 నోటు మేఘాలయ పోలీసుల దృష్టిని పూర్తిగా మళ్లించింది. ఇండోర్ చేరుకున్న షిల్లాంగ్ పోలీసు బృందం నిందితులకు వ్యతిరేకంగా ప్రతిరోజూ కొత్త ఆధారాలను సేకరిస్తోంది. ఇంతలో, రాజ్ కుష్వాహా వద్ద దొరికిన చిరిగిన రూ.10 నోటుపై షిల్లాంగ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రూ.10 సగం నోటును కనుగొన్న తర్వాత, హవాలా వ్యాపారానికి సంబంధించి పోలీసు దర్యాప్తు బృందాలు దానిపై దర్యాప్తు చేస్తున్నాయి. షిల్లాంగ్ పోలీస్ సిట్ సభ్యుడు ఎసిపి ఎస్ఎస్ సాంబా తన బృందంతో దర్యాప్తు కోసం ఇండోర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమైన సమాచారం వెల్లడించారు. నిందితుడు రాజ్ కుష్వాహాను షిల్లాంగ్‌లో విచారించినప్పుడు, అతని నుంచి సగం 10 రూపాయల నోటు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ దిశగా దర్యాప్తు జరుగుతోందని అన్నారు.

హవాలా వ్యవహారం తెరలేపిన మిస్టరీ
హవాలా వ్యవహారంలో నోట్లను అరవై అరవై భాగాలుగా కట్ చేసి పంపడం సాధారణం. లక్షల కోట్ల రూపాయల విలువైన అక్రమ లావాదేవీలు చిరిగిన నోట్ల ద్వారా జరుగుతాయి. సీరియల్ నంబర్ ఉన్న నోటులో సగం భాగాన్ని డబ్బు పంపిన వ్యక్తికి, మిగిలిన సగం హవాలా డబ్బు అందుకున్న వ్యక్తికి ఇస్తారు. ఆ భాగం ఎవరి దగ్గర ఉందో, వారికి డబ్బు అందజేస్తారు. రాజ్ కుష్వాహా వద్ద దొరికిన సగం నోటు కూడా దర్యాప్తు దిశను మార్చడానికి ఇదే కారణం. రాజ్ కుష్వాహా, సోనమ్ రఘువంశీ తోపాటు అతనితో సంబంధం ఉన్న వ్యక్తులు హవాలా వ్యాపారంలో పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సంజయ్ వర్మ కాదు – అదే రాజ్ కుష్వాహా
సోనమ్ ఫోన్ కాల్ రికార్డుల పరిశీలనలో మరో సంచలనం బయటపడింది. ఆమె ఫోన్‌లో ‘సంజయ్ వర్మ’ పేరుతో సేవ్ చేసిన నంబర్ అసలు రాజ్ కుష్వాహాదని వెల్లడైంది. పెళ్లికి ముందు 39 రోజుల వ్యవధిలో ఏకంగా 234 సార్లు కాల్ చేసిందని వెల్లడించారు. అంతేకాదు ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదుసార్లు కనీసం 30 నుంచి 60 నిమిషాలు మాట్లాడుకునేవారని కాల్ రికార్డులు చూపించారు పోలీసులు. ఓ పథకం ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సోనమ్… రాజ్ నంబర్‌ను సంజయ్ వర్మ అని సేవ్ చేసుకుందన్నారు.
సోనమ్ ‘సీన్’ – అనుమానాల వెల్లువ
సోనమ్ రఘువంశీ ఒక వీడియోలో మాట్లాడుతూ, రాజాతో జీవితాన్ని గడపాలనుకున్నాను అని కన్నీటిపర్యంతమైంది. ఇది ఒక ఎమోషనల్ డ్రామాగా మారినప్పటికీ, ఆ వీడియో వెలువడిన తర్వాతే ఆమెపై ప్రజల్లో గాఢమైన అనుమానాలు మొదలయ్యాయి. రాజా తన స్నేహితుడితో ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించాడు. పెళ్లికి ముందు మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా సోనమ్ రాజాతో సరిగ్గా మాట్లాడలేదని అతను చెప్పాడు. పెళ్లికి ముందు ఇద్దరి మధ్య ఒక డ్రెస్ విషయంలో గొడవ జరిగింది. చివరికి, గొడవను ముగించడానికి, రాజా ఆ డ్రెస్‌ను సోనమ్‌కి కొనిచ్చాడు.
ఇక, మే 11న రాజా రఘువంశీ, సోనమ్ వివాహం జరగ్గా సరిగ్గా నెలరోజులకు జూన్ 11న సోనమ్ తన భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. ఇక ఈ మర్డర్ కేసులో సోనమ్‌తో మరో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దర్యాప్తు సందర్భంగా మృతుడు రాజా రఘువంశీ సోదరుడు విపిన్ రఘువంశీ కీలక డిమాండ్ చేశాడు. సోనమ్ చాలా తెలివైనది, ఆమె వెనుక ఒక పెద్ద వ్యక్తి పేరు ఉన్నందున ఆమెకు నార్కో పరీక్ష చేయాలని విపిన్ డిమాండ్ చేశారు.
Read also:Uttar Pradesh: బిడ్డల్ని చంపి ప్రియుడితో పారిపోయే ప్లాన్ చేసిన ప్రియురాలు