రోడ్డు దాడుతుండగా ఓ నెమలిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ నెమలి(Peacock) ప్రాణాలతో విలవిలలాడుతూ కిందపడిపోయింది. సాయం కోసం నిరీక్షించింది. కానీ అటుగా వెళ్తున్న కొందరు దానికి సాయం చేయాల్సింది పోయి, అత్యంత క్రూరంగా దాని ఈకలు పీక్కుపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Read Also: TCS: 80వేలమందిపై ఆ కంపెనీ వేటు.. బలవంతంగా రిజైన్
అయో! పాపం అంటూ దానికి సేవ చేయాల్సింది పోయి, ఇదే అదును అనుకుని, దాన్ని పట్టుకుని, అందినకాడికి దాని ఈకల్ని పీక్కుని వెళ్లారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేది తెలియదు. కానీ నెటిజన్లు మాత్రం ప్రజలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరేం మనుషులు, అసలే సగం చచ్చిపోయిన దాన్ని బతికించాల్సింది పోయి, మళ్లీ ఉన్న ఆ కాస్త ప్రాణం కూడా తీసేందుకు దాని ఈకలు కావాలా మీకు? అంటూ కామెంట్లు పెడుతున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామస్తులు క్రూరత్వంపై(Villagers cruelity) నెటిజన్లు మండిపడుతున్నారు. చివరికి ఆ నెమలి విగతజీవిగా మారింది.

ఈ ఘటనలో ఏమి జరిగింది?
రోడ్డుపై వాహనం ఢీకొట్టిన నెమలి ప్రాణాలతో విలవిలాడుతుండగా, కొంతమంది దానిని కాపాడాల్సింది పోయి, క్రూరంగా దాని ఈకలు పీకేశారు.
ఈ సంఘటన ఎక్కడ జరిగింది?
వీడియోలో కనిపించినా, సంఘటన జరిగిన ప్రదేశం స్పష్టంగా తెలియలేదు
Read hindi news: hindi.vaartha.com
Read Also: