రోజురోజుకు యువత మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలవుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.తాజాగా హర్యానా (Haryana) రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో జరిగిన ఒక దారుణమైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాదకద్రవ్యాలకు బానిసైన కుమారుడు తన తల్లిని కేవలం రూ.20 ఇవ్వలేదని గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన శనివారం నుహ్ జిల్లాలో జరిగింది. జైసింగ్‌పూర్ గ్రామానికి చెందిన ముబారక్, రజియా దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే నాలుగేళ్ల క్రితం రజియా భర్త మరణించాడు. దీంతో రజియా కుమారుడు జింషెడ్ మాదకద్రవ్యాలకు బాలనిసయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రూ.20 ఇవ్వాలని తల్లి రజియాను అడిగాడు. అందుకు తల్లి రజియా (Razia) నిరాకరించడంతో ఆగ్రహించిన కుమారుడు జింషెడ్, ఇంట్లోని ఉన్న గొడ్డలి తీసుకొని తల్లిపై దాడికి పాల్పడ్డాడు.కుమారుడి దాడిలో తీవ్రంగా గాయపడిన రజియా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఈ సంఘటన
అయితే తన తల్లిని చంపిన తర్వాత, జంషెడ్ రాత్రంతా అదే ఇంట్లో పడుకున్నాడు. ఉదయం ఇంట్లో అతన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు జింషెడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లి రజియా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ సంఘటన మానవత్వాన్ని మంటగలిపినట్టుగా ఉంది. డబ్బు కోసం తనను పెంచిన అమ్మను చంపడం అంటే అది ఎంత నీచమైన చర్యో చెప్పడం చాలా కష్టం. యువత ఈ సంఘటనల్ని గమనించి మాదకద్రవ్యాలకు (Drugs) బానిసలవ్వకుండా జాగ్రత్త పడాలి. ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను రక్షించాలి. మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా నియంత్రించేందుకు కఠిన చట్టాలు, నిర్దాక్షిణ్యంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
సమాజంపై మాదకద్రవ్యాల దుర్వినియోగం యొక్క ప్రభావాలు ఏమిటి?
మాదకద్రవ్య దుర్వినియోగం వల్ల ప్రజలు దొంగతనం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా , హింస వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొని తమ వ్యసనాన్ని కొనసాగించడానికి కారణమవుతారు. ఈ నేర కార్యకలాపాలు సమాజాలను ప్రమాదంలో పడేస్తాయి, పోలీసులు, నేర న్యాయ వ్యవస్థతో సహా ప్రజా సేవలపై ఒత్తిడిని కలిగిస్తాయి
యువత పై మద్యం మాదక ద్రవ్యాల ప్రభావం?
నిరంతరం మాదకద్రవ్యాలను దుర్వినియోగం చేసే యువకులు తరచుగా విద్యాపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సంబంధిత సమస్యలు (మానసిక ఆరోగ్యంతో సహా), తోటివారితో సంబంధాలు సరిగా లేకపోవడం ,బాల్య న్యాయ వ్యవస్థలో పాల్గొనడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Dharamsthala: ‘ధర్మస్థల’ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేనా?