పంజాబ్ రాష్ట్రంలో సంచలనాన్ని రేపిన లంచం కేసు వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పంజాబ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి హరిచరణ్ సింగ్ భులార్‌ను అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. సీబీఐ అధికారులు ఆయన నివాసంలో నిర్వహించిన సోదాల్లో కళ్లుచెదిరే స్థాయిలో అక్రమ ఆస్తులు బయటపడ్డాయి.
Read Also: Yemen: నిమిష ప్రియకేసులో తాజా అప్‌డేట్
రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన పంజాబ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి నివాసంలో భారీగా డబ్బు, బంగారం బయటపడింది. రూ.8 లక్షల లంచం డిమాండ్ చేసి భులార్ అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా రూ. 5 కోట్ల నగదు, విలాసవంతమైన కార్లు, నగలు, ఖరీదైన వాచీలు వంటి భారీ అక్రమ ఆస్తులు బయటపడ్డాయి.
ఈ కేసులో భులార్‌తో పాటు, మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన హరిచరణ్ సింగ్ (Harcharan Singh Bhullar) 2009 బ్యాచ్ అధికారి. ఒక వ్యాపారవేత్తపై నమోదైన క్రిమినల్ కేసును మాఫీ చేయడానికి మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుని,

మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ వ్యాపారిపై
నెలవారీగా మామూళ్లు డిమాండ్ చేస్తున్నట్లు సీబీఐ (CBI) ఆరోపించింది. పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన పాత సామాన్లు డీలర్ ఆకాష్ బట్టా ఫిర్యాదు చేయడంతో గుట్టురట్టయ్యింది. తనను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించి, రూ.8 లక్షలు వసూలుచేసిన భులార్.. ఆ తర్వాత నెల నెల తనకు కొంత నగదు ఇవ్వాలని బెదిరించినట్టు ఆరోపించారు.
CBI ఎఫ్ఐఆర్ ప్రకారం.. లంచం సొమ్ము తన సహచరుడు కృష్ణ ద్వారా అందజేయాలని భులార్ డిమాండ్ చేశాడు. దీంతో మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ వ్యాపారిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ‘ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు మామూళ్లు ఇవ్వలేదు’ మధ్యవర్తి మాట్లాడిన ఆడియో క్లిప్ ఉందని సీబీఐ పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: