సింపథీని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ తరహా సైబర్ మోసాలు సామాన్య ప్రజలనే కాదు, సెలబ్రిటీలను కూడా వదలడం లేదు.హృదయవిదారక పోస్టులతో సహాయం కోరుతూ డబ్బులు వసూలు చేయడం ఇప్పుడు ఓ ట్రెండ్‌గా మారింది. తాజాగా ఈ తరహా ఆన్లైన్ మోసానికి ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ (Gv Prakash) గురయ్యారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది.
Read Also: Google Search 2025: టాప్‌లో ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే
వివరాల్లోకి వెళ్తే… ఎక్స్ (ట్విట్టర్)లో @prasannasathis అనే ఖాతా ద్వారా ఓ వ్యక్తి ఓ వృద్ధురాలి ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ మహిళ తన తల్లిగా పేర్కొంటూ, తండ్రి మరణించిన తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ ఆమెనే మోసిందని, తాజాగా ఆమె కూడా చనిపోయిందని హృదయవిదారక కథను అల్లాడు. తల్లి అంత్యక్రియలు నిర్వహించడానికి ఆర్థిక సహాయం కావాలంటూ జీవీ ప్రకాష్ (Gv Prakash) ను ట్యాగ్ చేస్తూ విజ్ఞప్తి చేశాడు.

కొద్దిసేపటికే అసలు నిజం బయటపడింది
ఆ పోస్ట్‌ను చూసిన జీవీ ప్రకాష్, అది నిజమేనని నమ్మి వెంటనే రూ.20,000 ఫోన్‌పే ద్వారా పంపించారు. అయితే డబ్బులు అందుకున్న తర్వాత ఆ వ్యక్తి ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో అనుమానం మొదలైంది. కొద్దిసేపటికే అసలు నిజం బయటపడింది. గూగుల్‌లో ఇప్పటికే ఉన్న ఆ వృద్ధురాలి ఫోటో, చాలా కాలం క్రితమే మరణించిన వ్యక్తికి సంబంధించినదని నెటిజన్లు గుర్తించారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి మోసపూరిత వ్యక్తుల వల్ల నిజంగా ఆపదలో లేదా అవసరంలో ఉన్న వ్యక్తులు ఎలాంటి సహాయం లేకుండా నష్టపోతారు. ఆపదలో ఉన్నవారిని, కష్టంలో ఉన్నవారిని ఆదుకునేందుకు జీవీ ప్రకాష్ లాంటి వ్యక్తులు ఎప్పుడూ ముందుకు వస్తున్నారు. కానీ తప్పుడు సమాచారంతో మోసపూరితమైన వ్యక్తులు ఇలా చేయడం సమాజానికి హానికరం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: