Guntur Road Accident: గుంటూరు జిల్లా నిడుముక్కల గ్రామ శివారులోని కోళ్ల ఫారం సమీపంలో శనివారం ఉదయం భయంకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు వైపు నుంచి మోతదక గ్రామానికి వెళ్తున్న ఓ ఆటోను ఎదురుగా అతివేగంతో వచ్చిన ద్విచక్ర వాహనం(Auto Bike Collisio) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Read also: AP: పేద కుటుంబంలో పెను విషాదం..ముగ్గురు మృతి

53 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతి
ఈ ఢీకొట్టుడు తీవ్రంగా ఉండటంతో ఆటోలో ప్రయాణిస్తున్న 53 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో ఆటోలో ఉన్న మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా, ఆటో డ్రైవర్‌తో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు, ఇద్దరు విద్యార్థినులు కూడా ప్రమాదంలో గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ సమీప ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ప్రాథమిక విచారణలో ద్విచక్ర వాహనం అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: