ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొండముది గ్రామంలో శనివారం అర్ధరాత్రి హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం (Alcohol) మత్తులో ఉన్న కుమారుడు నాగరాజు, తన తల్లి కొమ్ము జయమ్మ (60)ను దారుణంగా హత్య చేశాడు. మూడు సంవత్సరాల క్రితం భర్త మృతి చెందడంతో జయమ్మ కుమారుడితో కలిసి నివసిస్తోంది. అయితే నాగరాజు మద్యానికి బానిసగా మారి తరచూ మద్యం సేవిస్తూ ఉండడంతో ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
Read also: Anakapalli: రేబిస్ వలన పన్నెండేళ్ల బాలుడు మృతి

Guntur Crime
రోకలి బండతో జయమ్మ తలపై బలంగా దాడి
ఆ రాత్రి మద్యం సేవించిన నాగరాజు తల్లితో వాగ్వాదానికి దిగాడు. కోపోద్రిక్తుడైన అతడు సమీపంలో ఉన్న రోకలి బండతో జయమ్మ తలపై బలంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యం బానిసత్వం కుటుంబాలను ఎలా నాశనం చేస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: