child abuse case: దేశంలో ఎంతటి కఠిన చట్టాలు ఉన్నా చిన్నారులపై దారుణాల పరంపర ఆగటం లేదు. గుజరాత్(Gujarat Crime)లోని రాజ్‌కోట్ జిల్లా అట్కోట్ ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై జరిగిన దారుణం ప్రజలను కుదిపేసింది. డిసెంబర్ 4న జరిగిన ఈ ఘటనలో, ఒక వ్యక్తి చిన్నారిని అత్యాచారం(rape) చేయడానికి ప్రయత్నించగా, అది విఫలమవడంతో ఆమె ప్రైవేట్ పార్ట్‌లో ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Read also: Alluri District Crime: ఫోన్ తగ్గించమని చెప్పిన భర్తపై గొడ్డలితో దాడి

చిన్నారిపై మృగాడి పాశవికత్వం…
పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని మధ్యప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల రామ్‌సింగ్ తేర్‌సింగ్‌గా గుర్తించారు. బాధితురాలి కుటుంబం దాహోద్ జిల్లాకు చెందినదే కాగా, వారు అట్కోట్ సమీపంలోని పొలాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. అదే ప్రాంతంలో నిందితుడు కూడా పనికి వస్తుండేవాడు.
తండ్రి సయ్యం లేకుండా పాపపై పాశవిక దాడి
ఘటన జరిగినరోజు బాలిక కుటుంబం పొలంలో పనిలో నిమగ్నమై ఉండగా, నిందితుడు ఆమెను దొంగచాటుగా తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. చిన్నారి అరిచేయడంతో కోపంతో ఆమెపై అమానుషంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో వదిలిపెట్టిన చిన్నారిని కుటుంబ సభ్యులు కనుగొని రాజ్‌కోట్ ఆసుపత్రికి తరలించారు.
పోక్సో చట్టం కింద కేసు దర్యాప్తు సాగుతోంది. 10 ప్రత్యేక బృందాలతో గాలింపు జరిపిన పోలీసులు దాదాపు 100 మందిని విచారించారు. అనంతరం బాలికకు అనుమానితులను చూపించగా, ఆమె నిందితుడిని ఖచ్చితంగా గుర్తించింది. తేర్‌సింగ్‌కు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నట్లు గుర్తించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: