గద్వాల(Gadwal Crime) జిల్లాలో మానవత్వాన్ని కుదిపేసే ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురిపైనే లైంగిక దాడులకు పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సంబంధాల వెనుక దాగి ఉన్న ఈ నేరం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
Read Also: iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి

సమాచారం ప్రకారం
సమాచారం ప్రకారం, మొదటి భార్యకు పిల్లలు లేరనే కారణంతో ఆమె తన చెల్లిని భర్తకు రెండో వివాహం చేయించింది. ఈ దంపతులకు ఒక కుమార్తె (16) పుట్టింది. బాలిక చిన్నతనం నుంచే తండ్రి లైంగిక వేధింపులకు గురవుతూ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పలుమార్లు అత్యాచారం(rape) జరగడంతో బాలిక గర్భం దాల్చింది.
ఈ విషయం బయటకు వస్తే చట్టపరమైన చర్యలు(Legal proceedings) తప్పవని భావించిన నిందితుడు, ఎవరికి తెలియకుండా అబార్షన్ చేయించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బాలిక స్థానికంగా ఉండే మరో మహిళకు చెప్పగా, బాధితురాలి తల్లికి విషయాన్ని తెలియజేసిన స్థానిక మహిళ బాలిక కన్న తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, తండ్రి, అతని మొదటి భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: