మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే రన్‌వేకు 100 అడుగుల దూరంలోనే విమానం కూలిపోయిందని ప్రత్యక్షులు చెబుతున్నారు. అలాగే విమానంలో ఉన్న వాళ్లని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిమని, కానీ మంటలు చెలరేగడంతో విఫలమైందని తెలిపారు. విమానం కిందకు దిగుతున్నప్పుడు నియంత్రణ కోల్పోతున్నట్లు కనిపించిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ‘నేను నా కళ్లతో చూశా. నిజంగా చాలా బాధాకరం. విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు కూలిపోతుందేమో అనిపించింది. అలాగే జరిగింది. ఆ తర్వాత భారీగా పేలుడు సంభవించింది. మేం అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి చూశాం. విమానం మంటల్లో కాలిపోతుంది. మళ్లీ 4 నుంచి 5 సార్లు పేలుళ్లు సంభవించాయి. మరికొంత మంది ఇక్కడికి వచ్చారు. విమానంలో ఉన్న వారిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ పెద్ద మంటలు కావడంతో, ప్రజలు సహాయం చేయలేకపోయారు. అజిత్ పవార్ (Ajit Pawar) విమానంలో ఉన్నారు.
Read Also: Ajit Pawar Death: డిప్యూటీ సీఎం తో సహా ఆరుగురు దుర్మరణం

విమాన ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు
మరోవైపు విమాన ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందులో బారామతి విమానాశ్రయానికి కొంత దూరంలో ఉదయం 8:46 గంటలకు విమానం కూలినట్లు కనిపిస్తోంది. వెంటనే విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఇదిలా టేబుల్ టాప్ రన్‌వేపై ఈ ఘటన జరిగిందని డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా రన్‌వే స్టార్టింగ్ పాయింట్లో కుప్పకూలిందని పేర్కొన్నారు. ఈ రన్వేలు టేబుల్ ఉపరితలం మాదిరిగానే ఉంటుంది. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి రన్‌వేను ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ విమానాలు ల్యాండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: