దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరో వ్యక్తి మరణించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట (Red Fort) సమీపంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.
Read Also: TTD: అప్రూవర్ గా మారినా… వైవి సాక్ష్యాధారాలే కీలకం

మిగతావారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
సాయంత్రం 7 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు జరిగింది. ఈ ఘటన (Delhi Blast)లో అక్కడికక్కడే తొమ్మిది మంది మరణించారు. మరో 20 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రి కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు మరో వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మిగతావారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
బిలాల్ మృతితో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది. మృతదేహానికి ఈరోజే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: