ఆ తండ్రికి ఎంత కష్టం వచ్చిందో ఏమో తెలియదు. కువైట్ కు వెళ్లాడు. అక్కడ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే ఇటీవలే కువైట్ నుంచి ఇండియాకు తిరిగొచ్చాడు. ఎవరూ ఊహించని పని చేశాడు ఆ తండ్రి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి (East Godavari crime) జిల్లా మలికిపురం మండలం లక్కవరంలో నివాసం ఉంటున్న దుర్గాప్రసాద్ ఉపాధి నిమిత్తం కువైట్ కు (Kuwait) వెళ్లారు. ఇటీవలే ఇక్కడికి వచ్చారు. పిల్లలకు ఆధార్ అప్ డేట్ (Aadhaar update) చేయిస్తానని కుమారుడు మోహిత్ (13), కుమార్తె జాహ్నవి (9)ని తీసుకెళ్లాడు దుర్గాప్రసాద్ (37), అయితే గోదావరి నదిలో తొలుత కుమార్తెను నదిలోకి తోసేశాడు తండ్రి.
Read Also: TG: స్టార్టప్‌ల కోసం 1000 కోట్ల ఫండ్

ఎవరూ ఊహించని పని చేశాడు ఆ తండ్రి.
అది చూసిన కుమారుడు భయంతో పరుగులు పెట్టాడు. అయినా వదలిపెట్టకుండా దుర్గాప్రసాద్ వెంటపడి పటుకొని నదిలో (river) తోసి, అనంతరం అతను దూకేశాడు. తండ్రీ కొడుకులు సరదాగా ఆడుకుంటున్నారని అనుకున్నా.. ఆటోడ్రైవర్ తండ్రి, కుమారుడి వెంట పడడం చూసి సరదాగా ఆడుకుంటున్నారని అనుకున్నట్లుగా అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ చెప్పాడు. అంతలోనే ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదని అతను బాధపడుతున్నారు. పిల్లలను చంపి, దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియవు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: