వైద్యులు అంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేవారు. డాక్టర్ వద్దకు వెళ్తే చాలు సగం జబ్బు నయమైపోతుందని రోగులు భావిస్తారు. డాక్టర్ అంటే మరి అంత భరోసా. సమాజంలో వైద్యులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వారంటే అందరికీ గౌరమే. ఎంతో మర్యాద ఇచ్చి మాట్లాడతారు. తమ జబ్బు బాగైపోతే వైద్యుడే దేవుడని అంటారు. ఇంతటి విలువైన వృత్తి చేస్తున్న ఓ వ్యక్తి ఏకంగా తన వృత్తితోపాటు డ్రగ్స్(Drugs) వ్యాపారం చేస్తున్నాడు. ఇలాంటి వైద్యులకు ఎలాంటి శిక్ష విధించాలి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: Jobs: భారీగా పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు
వైద్యుడి ఇంట్లో దొరికిన డ్రగ్స్ కలకలం
హైదరాబాద్-ముషిరాబాద్(Mushirabad) లో డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో ఆరు రకాల డ్రగ్స్(Drugs) లభ్యమయ్యాయి. అధికారులు పక్కా సమాచారంతో వైద్యుడు జాన్ పాల్ ఇంట్లోకి వెళ్లి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ జాన్ పాల్ తన ముగ్గురు స్నేహితులు ప్రమోద్, సందీప్, శరత్ అనేవారి ద్వారా ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. మొత్తం ఆరు రకాల డ్రగ్సను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: