కర్ణాటకలోని ధర్మస్థలంలో వందకుపైగా మహిళలు అత్యాచారం, హత్యలకు గురవుతున్నా దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుంది.1998 నుంచి 2014 వరకు వందకుపైగా మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు ఓ పారిశుద్ధ కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీనితో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపాటుకు గురైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఈ కేసు పూర్వాపరాలను గమనిద్దాం.
లోదుస్తులు లేకుండా పలు మృతదేహాలు
మరణించిన మహిళల మృతదేహాలు చాలావరకు లోదుస్తులు కూడా లేవు. మృతుల్లో పిల్లలు, యువతులు ఉన్నారు. చాలా మృతదేహాలు,లైంగిక దాడి, హింసకు గురైన ఆనవాలు ఉన్నాయి. వారిపై లైంగిక దాడి జరిగిఉండవచ్చని భావిస్తున్నారు. తాను దాదాపు 100కు పైడా మ
తదేహాలను పూడ్చిపెట్టాను అని ధర్మశాల పారిశుద్ధ కార్మికుడు (Dharmasthala sanitation worker) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ కేసు సంచలనంగామారింది.
సిట్ విచారణ
మహిళలపై అత్యాచారం, హత్యలు జరగడంతో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నది. అంతేకాదు ప్రత్యేకదర్యాప్తు బృందం (Special Investigation Team) తో విచారణ జరిపించాలనే డిమాండ్ ఊపందుకుంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం చేసేది లేక సిట్ను ఏర్పాటు చేసింది.
వందకుపైగా మృతదేహాలను ఎలా ఖననం చేశారు?
ఈ కేసులో పలు అనుమానాలకు తావు ఇస్తున్నది. మరణించిన వారంతా ఎవరు? ఇంత అన్యాయం జరుగుతున్నా బాధిత కుటుంబాలు,ఎందుకు మౌనంగా ఉన్నారు. వీరిని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేశారా? అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకాలం పారిశుద్ధ
కార్మికుడు మౌనంగా ఉండి, ఇప్పుడే ఎందుకు బయటికొచ్చి ఈ వివరాలను చెబుతున్నారు? ధర్మస్థల క్షేత్ర పవిత్రతను దెబ్బతీసేందుకు,ఇదంతా చేస్తున్నారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

చనిపోయింది ఎవరు?
ఇప్పటి వరకు చనిపోయింది ఎవరో, మృతదేహాల అవశేషాలు ఎవరివో తెలియదు. వీటిపై సిట్ అధికారులు డీఎన్ఏ అనాలసిస్, స్కెలిటన్,ఫోరెన్సిక్ పరీక్షలు (Forensic tests) చేసి, మృతదేహాలు ఎవరివి, వాళ్లు ఎలా చనిపోయి ఉంటారని అంచనాకు రావాలి. అప్పుడే చనిపోయింది ఎవరోకచ్చితంగా చెప్పేందుకు అవకాశం లభిస్తుంది.
కోర్టులో వాంగ్మూలం
ఈనెల 11న విజిల్ బ్లోయర్ బెల్లంగడి కోట్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో ఓ ప్రాంతంలో తాను ఖననం చేసిన మృతదేశం,అవశేషాలు సహా దానికి సంబంధించిన ఫొటోలను కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. అంతేకాదు హత్యలు ఎవరు చేశారో వారి పేర్లను
కూడా బయటపెట్టినట్లు సమాచారం. ఇదే నిజమైతే దేశచరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది,అనడంలో సందేహం లేదు.
ధర్మస్థల యొక్క చరిత్ర ఏమిటి?
సుమారు 800 సంవత్సరాల క్రితం ధర్మస్థల ప్రాంతాన్ని కుడుమ (Kuduma) అనే పేరుతో పిలిచేవారు. ఇది అప్పట్లో బెళ్తంగడి తాలుకాలోని మల్లర్మాడి అనే గ్రామంలో ఉండేది.
ధర్మస్థల దేవస్థానానికి యజమాని ఎవరు?
ధర్మస్థల దేవస్థానానికి వారసత్వ పాలకుడు డా. వీరేంద్ర హెగ్గడే గారు. ఆయన 1948 నవంబర్ 25న జన్మించారు.
Read hindi news: hindi.vaartha.com