గతకొన్ని రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం గురించి మీడియాలో విపరీతంగా వార్తలు వెలువడుతున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందలమంది అమ్మాయిలు, బాలికలను లైంగికంగా హింసించి, హతమార్చి ఆతర్వాత పూడ్చిపెడుతున్న ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది. అక్కడ పనిచేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ధైర్యం చేసి, అక్కడి అరాచకాలను చెప్పడంతో దేశంలోనే ఈ ఉదంతం తీవ్ర విమర్శలకు గురవుతున్నది.
1995 నుంచి 2014 మధ్య ధర్మస్థలంలో (Dharamsthala) పని చేసి, ఆపై మానేసిన మాజీ పారిశుద్ధ కార్మికుడి చెప్పిన వివరాల ప్రకారం వందలాది మృతదేహాలను అందులోనూ మహిళలు, మైనర్ బాలికలని ఎక్కువగా పూడ్చిపెట్టమని బెదిరించారని చెప్పాడు. ఈ మృతదేహాలై అత్యాచారం, హత్యలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని అతను తెలిపాడు. అతని ఆరోపణలకు దగ్గరగా ధర్మస్థలిలో హత్య కేసులు కూడా నమోదైయ్యాయి.

వివాదంలో సౌజన్య ఉదంతం
సౌజన్య హత్య 2012లో ధర్మస్థలంలో (Dharamsthala) జరిగింది. 17ఏళ్ల విద్యార్థిని అయిన సౌజన్య అత్యాచారం, హత్య కేసు ఈ వివాదంలో అత్యంత ప్రముఖమైనది. ఈ కేసులో విచారణ సరిగా జరగలేదని, ఒక వ్యక్తిని బలిపశువుగా చేసి, అసలు దోషులను తప్పించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏకైక నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేయడం గమనార్హం.
మిస్టరీగానే అనన్యభట్ హత్య
అనన్య భట్ 2003లో కాలేజీ ట్రిప్లో అదృశ్యమైన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్యభట్ (Ananya Bhat) కేసు కూడా ఈ వివాదాలతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లి తన కూతురి కేసును తిరిగి విచారించాలని కోరుతున్నారు.
ఆలయ యాజమాన్యంలోని పెద్దల పాత్రపై అనుమానాలు
ఈ వివాదాలు ధర్మస్థల ఆలయ నిర్వహణ, ముఖ్యంగా ధర్మాధికారి డా.డి.వీరేంద్ర హెగ్గడే, ఆయన కుటుంబంపై కూడా ఆరోపణలు ఉన్నాయి. వీరేంద్ర వాగ్గడే రాజ్యసభ సభ్యుడు, పద్మవిభూషన్ గ్రహీత కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేరాలను కప్పిపుచ్చడంలో ఆలయ యాజమాన్యంలోని పెద్దపెద్ద వ్యక్తు ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
కొనసాగుతున్న తవ్వకాలు కర్ణాటక ప్రభుత్వం (Government of Karnataka) దీన్ని సీరియస్ గా తీసుకుని, సిట్ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సిట్ ధర్మస్థల అటవీ ప్రాంతంలో శ్మశాన వాటికల్లో తవ్వకాలు చేపట్టింది. ప్రత్యేక పూజ చేసి సిట్ ఈ ఆపరేషన్ను ప్రారంభించింది. అసలు ఈ సామూహిక మరణాలు జరిగాయా? అసలు జరిగితే ఎందుకు జరిగాయి? అన్న కోణాల్లో సిట్ ఈ తవ్వకాలు చేపట్టింది. సుమూరుగా 15 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతువరకు త్వవగా.. ఎలాంటి అస్థిపంజర అవశేషాలు, ఇతర భౌతిక ఆధారాలు కూడా అధికారులకు లభించలేదు. అయినా మళ్లీ తవ్వకాలు జరపాలని సిట్ భావిస్తోంది.
ధర్మస్థల ఉదంతం ఎందుకు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది?
వందలమంది బాలికలపై లైంగికదాడి, హత్య ఆరోపణలతో పాటు ఆలయ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
సిట్ తవ్వకాల్లో ఇప్పటివరకు ఏమి వెలుగులోకి వచ్చింది?
తవ్వకాల్లో ఎలాంటి అస్థిపంజరాలు లేక భౌతిక ఆధారాలు లభించకపోయినా, సిట్ మళ్లీ తవ్వకాలు చేయాలని నిర్ణయించింది.
Read Hindi News : hindi.vaartha.com
Read also: midazolam injection: ఆపరేషన్ల సమయంలో వాడే మత్తు ఇంజక్షన్లు బహిరంగ మార్కెట్లో విక్రయం