ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో(Delhi Blast) జరిగిన పేలుడు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిని, కుట్రలో భాగమైన వారిని ఎవరినీ వదలబోమని స్పష్టం చేశారు. భూటాన్ పర్యటన సందర్భంగా మాట్లాడుతూ, “మూలాల్లోకి వెళ్లి, దాగి ఉన్న ప్రతి ఒక్కరినీ బయటకు లాగుతాం. దేశ భద్రతకు హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని అన్నారు.
Read Also: Red Fort Blast: ఆత్మాహుతి దాడేనా? బలమైన ఆధారాలు బయటకు!

భూటాన్ పర్యటనలో మోదీ స్పష్టమైన సందేశం
భూటాన్ పర్యటనలో భాగంగా ప్రసంగించిన మోదీ, ఉగ్రవాదంపై భారత్ యొక్క సున్నితమైన కానీ దృఢమైన వైఖరిని ప్రపంచానికి తెలియజేశారు. దేశంపై దాడి చేయాలని ప్రయత్నించే శత్రువులెవరైనా తమ చర్యలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
పహల్గాం మారణహోమం తర్వాత మొదటి స్పందన
పహల్గాం మారణహోమం(Pahalgam massacre) తర్వాత ఇది మోదీ చేసిన మొదటి పెద్ద స్పందన. ఆయన ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ ముష్కరులకు గట్టి హెచ్చరిక, (Delhi Blast)ప్రపంచ దేశాలకు భారత్ ఉగ్రవాదాన్ని తట్టుకోదనే స్పష్టమైన మెసేజ్ పంపారు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు మరింత బలపరిచారు. ఇంటెలిజెన్స్ సంస్థలు సున్నిత ప్రాంతాల్లో కఠిన పర్యవేక్షణ చేపట్టగా, సరిహద్దు రాష్ట్రాల్లోనూ గస్తీ పెంచారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: