న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు (Delhi Blast) దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ తన బృందంలోని ఇతర సభ్యుల వద్ద తనను తాను ‘అమీర్’ (పాలకుడు లేదా రాజు) అని పిలిపించుకునేవాడని విచారణలో వెల్లడైంది. ఈ దాడిలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Read Also: IMD: చైనా దిశగా కదులుతున్న హైలీ గుబ్బి బూడిద మబ్బులు

వైట్ కాలర్ ఉగ్రవాద ముఠా, ‘ఆపరేషన్ అమీర్’
హర్యానాలోని ఫరీదాబాద్‌లో పట్టుబడిన ‘వైట్ కాలర్’ ఉగ్రవాద ముఠా సభ్యులను విచారించగా ఈ కీలక సమాచారం బయటపడింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ద్వారా ఈ ముఠాలోకి మొదటగా చేరిన డాక్టర్ ముజామిల్ షకీల్. ఉమర్ గురించిన వివరాలను వెల్లడించాడు. ఉమర్ అనుభవం, మేధస్సు ముందు తానొక సాధారణ కూలీ లాంటి వాడినని ముజామిల్ పేర్కొన్నాడు. ఈ దాడికి ఉగ్రవాదులు ‘ఆపరేషన్ అమీర్’ అని పేరు పెట్టుకున్నారు.
ఉమర్ ఉన్ నబీ ప్రొఫైల్, ప్రేరణ
విచారణ వర్గాల కథనం ప్రకారం, ఉమర్ ఉన్ నబీకి (umar nabi) తొమ్మిది భాషల్లో ప్రావీణ్యం ఉంది. అతడు సులభంగా ఓ అణు శాస్త్రవేత్త అయ్యేంత తెలివైనవాడని సహచరులు తెలిపారు. “మేము అతడిని కాదనలేకపోయేవాళ్లం. అతని మాటల్లో ఎంతో లోతైన పరిశోధన ఉండేది. తనను అమీర్ అని పిలిపించుకుంటూ, మతం కోసమే ఇదంతా చేస్తున్నానని చివరి వరకు నమ్మకం కలిగించాడు” అని ముజామిల్ చెప్పినట్లు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.
ప్రతీకారం, ప్రభావాలు: 2016లో భద్రతా దళాల చేతిలో హతమైన ఉగ్రవాది బుర్హాన్ వనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఉమర్ ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. జమ్మూకశ్మీర్‌కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా రద్దు, హర్యానాలోని మేవాట్-నూహ్‌లో జరిగిన మత ఘర్షణలు, గో సంరక్షకుల చేతిలో ఇద్దరు ముస్లిం యువకుల హత్య వంటి ఘటనలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని ఉమర్ తరచూ చెప్పేవాడని నిందితులు తెలిపారు.
బాంబు తయారీ: ఆత్మాహుతి దాడికి ఉపయోగించిన కారులో ఎసిటోన్, చక్కెర పొడి, యూరియా వంటి వాటితో బాంబు తయారు చేసినట్లు గుర్తించారు. ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలోని తన గదిలోనే బాంబు తయారీపై ప్రయోగాలు చేసినట్లు ఆధారాలు లభించాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: