हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Accident: ప్రాణాలు తీసిన బైక్ విన్యాసాలు.. ఇద్దరి మృతి

Vanipushpa
Accident: ప్రాణాలు తీసిన బైక్ విన్యాసాలు.. ఇద్దరి మృతి

ఉత్తరప్రదేశ్‌(Uttara Pradesh)లో జరిగిన ఓ బైక్ విన్యాసం విషాదకరంగా ముగిసింది. సరదా కోసం చేసిన స్టంట్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఢిల్లీ-డెహ్రాడూన్ (Delhi-dehradun) ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా బైకులు నడుపుతూ ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదం కెమెరాలో రికార్డవగా, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు
ఆగస్టు 13న ఘజియాబాద్ సమీపంలోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఇద్దరు వ్యక్తులు బైక్ స్టంట్లు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరూ తమ బైక్‌లపై వేర్వేరు దిశల నుంచి ఒకరినొకరు సమీపిస్తూ అతివేగంతో దూసుకొచ్చారు. క్షణాల్లో రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఇద్దరూ గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూసేవారిని కలచివేస్తున్నాయి. మృతులను రోహిత్ (31), సుబోధ్‌ (42)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రహదారి ఇంకా నిర్మాణ దశలోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలకు దూరంగా ఉండాలని యువతకు సూచిస్తున్నారు.

రహదారి ప్రమాదం

రహదారి ప్రమాదాలు (Road accidents), రహదారి మీద సంభవించే ప్రమాదాలును రహదారి ప్రమాదాలు అంటారు.రహదారి ప్రమాదాలలో సాధారణంగా వాహనాలు ఒకదానినొకటి గాని, లేదా రహదారి మీద నడిచే పాదాచారుల్ని లేదా జంతువుల్ని ‘డీకొట్టి’ ద్వారా జరుగతాయి.


రోడ్డు ప్రమాదాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

వివేకంతో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. కఠినమైన ట్రాఫిక్ చట్టాలను రూపొందించడం, మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండటం మరియు రోడ్లను సరిగ్గా నిర్వహించడం ద్వారా కూడా ప్రమాదాలను నివారించవచ్చు. ఇకపై రోడ్డు ప్రమాదాలకు మనం కారణం కాకూడదు లేదా బాధితులం కాకూడదు!

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/himalayan-glaciers-melting-rapidly-climate-change-impact/national/530708/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870