మహారాష్ట్ర(Maharastra)లోని నాందేడ్ జిల్లా(Nanded District) పరువు హత్య కలకలం రేపింది. ఒక వ్యక్తి తన కుమార్తెతో పాటు ఆమె ప్రియుడిని చంపి, వారి మృతదేహాలను బావిలో పడవేసి, ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. సోమవారం సాయంత్రం నాందేడ్‌జిల్లా ఉమ్రి తాలూకాలోని గోలెగావ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉమ్రి తాలూకాలోని బోర్జుని గ్రామానికి చెందిన సంజీవని కమలే అనే యువతికి, గత ఏడాది గోలెగావ్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. అయితే సంజీవనికి అప్పటికే తన సొంత గ్రామానికి చెందిన లఖన్ బాలాజీ భండారేతో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో లఖన్ తరుచుగా ఆమె అత్తవారింటికి వస్తూ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు.

విపరీతంగా కొట్టి ఆపై చంపారు
సోమవారం, మరోసారి గోలెగావ్ గ్రామానికి వచ్చిన లఖన్ బాలాజీ భండారే, సంజీవనితో ఉండగా ఆమె అత్తమామలు, భర్త పట్టుకున్నారు. అనంతరం ఆమె తండ్రి మారుతి సురానేకు ఫోన్‌లో సమాచారం అందించారు. ఆ మహిళ తండ్రి, తాత, మామ సంజీవని అత్తమామల ఇంటికి వచ్చి, ఆ ఇద్దరినీ పనంద్ రోడ్డుకు అవతలి వైపున ఉన్న బోర్జుని గ్రామానికి తీసుకెళ్లారు. అనంతరం ఇద్దరినీ విపరీతంగా కొట్టడంతో చంపి, వారి మృతదేహాలను కర్కల శివార్‌లోని పెద్ద బావిలో పడేశారు.
పరువు హత్య కేసుగా నమోదు
కాగా, ఈ విషయమై ఉమ్రి పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ అంకుష్ మానే మాట్లాడుతూ, ప్రాథమిక దర్యాప్తులో ఆ యువతి లఖన్ బాలాజీ అనే యువకుడితో కొనసాగిస్తున్న సంబంధాన్ని వారి కుటుంబం వ్యతిరేకిస్తోందని తేలిందని అన్నారు. ప్రాథమికంగా ఇది పరువు హత్య కేసుగా భావిస్తున్నామని మానే అన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :