iBOMMA One అనే వెబ్‌సైట్ గురించి వస్తున్న వార్తలపై సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. ఆ సైట్‌ను పరిశీలించినప్పుడు అందులో ఎలాంటి పైరసీ సినిమాలు లేవని వారు తెలిపారు. కొత్తగా రిలీజయిన సినిమాలు అందుబాటులో ఉన్నాయన్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేశారు. సైట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినా పనిచేయకపోవడంతో పాటు ఏ ఇతర అనుమానాస్పద లేదా పైరసీ వెబ్‌సైట్లకు రీడైరెక్ట్ అవ్వడం కూడా లేదని వివరించారు.
Read also: VIZAG: వైజాగ్‌లో హృదయవిదారక ఘటన.. శిశువును ముక్కలు చేసి కల్వర్టులో

Police clarification on iBOMMA One
పైరసీని అరికట్టడానికి ప్రత్యేక పర్యవేక్షణ
అదే సమయంలో గతంలో iBOMMA, Bappam వంటి సినిమాల పైరసీకి ఉపయోగించే పలు వెబ్‌సైట్లను ఇప్పటికే బ్లాక్ చేసినట్లు అధికారులు గుర్తు చేశారు. పైరసీని అరికట్టడానికి ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: