పెళ్లంటే నూరేళ్ల పండుగ అంటారు. వివాహం(Crime) స్వర్గంలో జరుగుతాయని పెద్దలంటారు. అంటే పెళ్లితో యువతి, యువకుడు జీవితాంతం ఒకరిపై ఒకరు ఆధారపడి, అనురాగాన్ని, ప్రేమను పంచుకుంటూ తమదైన అందమైన గృహాన్ని నిర్మించుకోవడమే కదా! సమాజానికి కుటుంబమే పునాది. సమాజం బాగుండాలి అంటే కుటుంబం బాగుండాలి. లేకపోతే సమాజం పాడైపోతే, దేశం పురోగభివృద్ధి కుంటుపడుతుంది. దేవుడు ఆనందంతో కూడిన వివాహ(Crime) వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కానీ ఆధునిక కాలంలో కొంతమంది భార్యలు భర్త, పిల్లలు ఉన్నా మరొకడి పొందుకోసం తహతహలాడుతున్నారు. తద్వారా కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఓ వివాహితకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నా..మరొకరితో సంబంధం పెట్టుకుని, అతడిని పెళ్లాడని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి..
Read also: BJP: కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఫిర్యాదు
ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన భార్య
కాన్పూర్ జిల్లాలోని(Kanpur) బంబురిహా గ్రామానికి చెందిన బాబురామ్ 2009లో షాపూర్ కు చెందిన నాంకిని వివాహం చేసుకున్నాడు. వారికి చందన్, లాలి అనే ఇద్దరు కుమార్తె ఉన్నారు. ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాల క్రితం నాంకి అతన్ని విడిచిపెట్టేసింది. అనంతరం బాబూరామ్ మహారాజ్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సర్సౌల్ కు చెందిన శాంతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు అంకుష్, అర్పిత్ తోపాటు నిత్య అనే కుమార్తె ఉన్నారు. కొంతకాలం పాటు వీరంతా హ్యాపీగా జీవించసాగారు.
అయితే గత రెండు నెలలుగా శాంతి ఘటంపూర్ కు చెందిన ఒక యువకుడితో ఫోన్లో గంటల తరబడి మాట్లాడేది. ఓ రోజు ఆమె తన ప్రియుడితో మాట్లాడుతూ ‘త్వరలో పెళ్లి చేసుకుందాం’ అని చెప్పింది. ఆ మాటల్ని భర్త బాబూరామ్ విన్నాడు. అనంతరం ఆమెను ప్రశ్నించాడు. ‘నా మొదటి భార్యను విడిచిపెట్టిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు మరొకరిని పెళ్లాడుతున్నావా?’ అని భర్త అడిగాడు. అందుకు ఆమె బదులిస్తూ ‘నాకు మీతో జీవించడం ఇష్టం లేదు. నేను అతన్ని వివాహం చేసుకుంటాను’ అని భర్తకు ఖరాఖండిగా చెప్పేసింది భార్య.
హత్యకు ప్రణాళిక భార్య మాటలతో బాబూరామ్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో వీరిమధ్య గొడవ జరిగింది. అనంతరం గొడవ చల్లారాక భోజనం చేసి అందరూ నిద్రపోయారు. కానీ బాబూరామ్ కు మాత్రం నిద్రపట్టలేదు. ఎలాగైనా తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. అర్థరాత్రి సమయంలో నిద్రపోతున్న భార్య శాంతి గొంతును స్కార్ఫ్ నులిమి చంపేశాడు.
ఆ తర్వాత బాబూరామ్ సైతం అదే స్కార్ఫ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతురాలి కుమార్తె ఉదయం లేచి చూసే సరికి తల్లి నేలపై చనిపోయి కనిపించింది. అదే సమయంలో తండ్రి దూలానికి వేలాడుతూ కనిపించడంతో భయంతో కేకలు వేసింది. వవెంటనే చుట్టుపక్కల వారు వచ్చి చూసి షాకయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. తల్లి, తండ్రి ఇద్దరు మరణించడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. క్షణికావేశంలో, క్షణికమైన సుఖాల కోసం పక్కదారి పడితే కుటుంబాలు ఏవిధంగా నాశనమైపోతాయో ఈ ఉదంతం ఉదాహరణ.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: