నేటి కాలంలో సొంత బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోనూ ఇలాంటి దారుణ ఘటనే చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని కొండకిండాం గ్రామంలో పెదమజ్జి నాయుడు (72), ఆయన కొడుకు గణేష్ నివాసం ఉంటున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఆస్తి గొడవలు తలెత్తాయి.
Read Also: Immunity: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచడానికి మార్గాలు
ఆస్తి కోసం కాలు విరగొట్టిన కొడుకు
కొడుకు గణేష్ ఆస్తి(Property) కోసం కన్న తండ్రి పెదమజ్జి నాయుడు కాలు విరగొట్టాడు. దీంతో చికిత్స కోసం తండ్రి తన భూమిని అమ్మకానికి పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న గణేష్, తండ్రిని అడ్డు తొలగించుకుంటేనే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని భావించాడు. ఈ క్రమంలోనే గణేష్ అర్ధరాత్రి సమయంలో గునపంతో తండ్రి గుండెలపై పదేపదే గుద్ది దారుణంగా చంపాడు. చంపవద్దని తండ్రి కాళ్లు పట్టుకున్నా కూడా గణేష్ వినలేదని తెలుస్తోంది.

హత్య అనంతరం పరారీ
తండ్రిని దారుణంగా హత్య చేసిన అనంతరం గణేష్(Ganesh) అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, పారిపోయిన నిందితుడు గణేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది?
విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం, కొండకిండాం గ్రామంలో జరిగింది.
తండ్రిని కొడుకు ఎందుకు హత్య చేశాడు?
ఆస్తి కోసం, తండ్రిని అడ్డు తొలగించుకుంటే భూమి దక్కుతుందని భావించి హత్య చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: