ట్రాన్స్ జెండర్లు రోజురోజుకు వివక్షకు గురవుతున్నారు. వారిపై అఘాయితాలు పెరిగిపోతున్నాయి. సమాజంలో వారిపై ఉన్న చిన్న చూపు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఒకవైపు వారి ఆగడాలు శృతిమించిపోతున్నాయి. రాత్రివేళ్లలో వాహనదారులపై వీరు తమ ప్రతాపాన్ని చూపిస్తూ, అందినకాడికి దోచుకుంటున్నారు. ఇది ఒకవైపు అయితే మరోవైపు వారిపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. వారికి న్యాయం చేసే దిక్కులేదు. తాజాగా ఓ ట్రాన్స్ జెండర్ పై సామూహిక అత్యాచారం చేశారు. ఆపై వీరిమధ్య మనస్పర్థలు రావడంతో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని, చంపుకునేంతవరకు వెళ్లారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ నిర్మానుష్య ప్రాంతంలో సామూహిక అత్యాచారం(Crime) జగద్గిరిగుట్ట(Jagadgirigutta) ప్రాంతంలో ఓ ట్రాన్స్ జెండర్ ను రోషన్ సింగ్ (25), మరో ఆరుగురు స్నేహితులు 15 రోజుల క్రితం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసారు. అయితే డబ్బు చెల్లించే విషయంలో వీరిమధ్య గొడవ జరిగింది. దీంతో వీరిపై ట్రాన్స్ జెండర్ బాలానగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
Read also: దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు

ట్రాన్స్ జెండర్ తమపై కేసు పెట్టమని బాలాశా రెడ్డి
ఉసిగొల్పాడని, అతన్ని ఎలాగైనా హతమారుస్తానని రోషన్ సింగ్ తన స్నేహితులతో చెప్పాడు. కక్షకట్టి హతమార్చారు రోషన్ సింగ్ అన్న మాటలు బాలాశౌ రెడ్డికి తెలియడంతో వాడు నన్ను చంపడమేంటి నేనే వాడిని చంపుతానని(Crime) రోషన్ సింగ్ పై పగ బట్టాడు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం మద్యం తాగి జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్దకు రోషన్ సింగ్, బాలశౌ రెడ్డి, అతని స్నేహితులు ఆదిల్, మహమ్మద్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా రోషన్ సింగ్, బాలాశౌ రెడ్డిల మధ్య గొడవ జరగగా రోషన్ సింగ్ చేతులను మహమ్మద్ వెనక నుండి పట్టుకోవడంతో బాలశౌ రెడ్డి కత్తితో దారుణంగా పొడిచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోషన్ సింగ్ మరణించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: