Crime News : కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికులు సమాచారం (Minor) ఇవ్వగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు.
బాలికపై లైంగిక దాడికి యత్నించిన యువకుడు
సంగీత్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లగా, బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం తండ్రి భోజనానికి ఇంటికి వచ్చేసరికి తన కుమార్తె మృతదేహం కనిపించింది. వెంటనే ఆయన స్థానికులకు సమాచారం ఇచ్చాడు.(Crime News)
తర్వాత పోలీసులు ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. హత్య వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. బాలిక ఎదురు తిరగడంతో యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. బాలిక ఒంటరిగా ఉందని తెలుసుకొని యువకుడు అక్కడికి వెళ్లాడు. అతను దగ్గరి బంధువే అయి ఉంటాడనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read also :