ఒడిశా రాష్ట్రం జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ఒక మైనర్ బాలికపై (minor girl) చోటుచేసుకున్న అమానవీయ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ముగ్గురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా, నేరం బయటపడకుండా చూడాలని ఆమెను సజీవంగా పూడ్చివేయాలన్న ప్రయత్నం చేశారు.

పాశవికంగా ప్రవర్తించిన సోదరులు – నెలల తరబడి లైంగిక దాడులు
బనశ్బార గ్రామానికి చెందిన భాగ్యధర్ దాస్ మరియు పంచనన్ దాస్ అనే ఇద్దరు సోదరులు, బాధిత మైనర్ బాలికపై గత కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ దారుణానికి వారి స్నేహితుడు తులు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. బాలిక ఐదు నెలల గర్భంతో ఉందని తెలిసిన తర్వాత, తమ నేరం బయట పడకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆమెను హత్య చేసేందుకు (To kill her) పథకం వేసారు.
అబార్షన్ ముసుగులో హత్యాయత్నం
బాలికకు అబార్షన్ చేయిస్తామని నమ్మించి, ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ముందుగానే తవ్విన గొయ్యి కనిపించడంతో బాలికకు ప్రమాదం ముందుగానే అర్థమైందట. నిందితులు ఆమెను బెదిరించి గొయ్యిలో పూడ్చబోతున్న సమయంలో, ఆమె ధైర్యంగా తప్పించుకుని తన తండ్రిని ఆశ్రయించింది.
పోలీసులకు ఫిర్యాదు – ఇద్దరు అరెస్టు, ఒకరు పరార్
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కుజంగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె ఐదు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు భాగ్యధర్ మరియు పంచనన్ దాస్‌లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. మూడో నిందితుడు తులు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పెరుగుతున్న లైంగిక నేరాలు – ఒడిశాలో ఆందోళన
ఈ దారుణ ఘటనతో పాటు, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో మరో ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బర్త్‌డే పార్టీ నుంచి తిరిగొస్తున్న మరో బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి పొలాల్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. బాలిక తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఇదే వారం, మల్కనగిరి జిల్లాలో మరో మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడగా, అనంతరం ఆమెపై ట్రక్ డ్రైవర్ మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ వరుస ఘటనలు ఒడిశాలో బాలికల భద్రతపై తీవ్రమైన ఆందోళనను కలిగిస్తున్నాయి .
Read hindi news: hindi.vaartha.com
Read also: Ashok Gajapathi Raju: గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు