ఈ మధ్య కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భార్యభర్తల మధ్య హత్యలకు సంబంధించిన ఘోర సంఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. వ్యక్తిగత సమస్యలు, అనుమానాలు, ఆవేశం వంటి కారణాల వల్ల కుటుంబాల్లో రక్తసంబంధాలు దారుణంగా ముగుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ఘటనల్లో భార్యలు తమ ప్రియుడి కోసం భర్తలను ఉద్దేశపూర్వకంగా చంపడం, మరికొన్ని సందర్భాల్లో భర్తలు చిన్న చిన్న విషయాలపై అనుమానం లేదా గొప్ప కోపంతో భార్యలను హతం చేయడం కొనసాగుతోంది.
ఈ పరిస్థితి సమాజంలో భయభ్రాంతిని కలిగిస్తోంది.యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) కు చెందిన బోడ శంకర్, మంజుల దంపతులు బతుకుదెరువు కోసం ముంబైలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. కొంతకాలంగా శంకర్ తన భార్య మంజులపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడేవాడు. భర్త వేధింపులు (Harassment) భరించలేక మంజుల ఈ నెల 14న హైదరాబాద్‌లోని తన అక్క ఇంటికి వచ్చింది. శంకర్ కూడా తన పిల్లలతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు.

శంకర్ కత్తితో మంజుల గొంతు కోసి ఆమెను చంపేశాడు
శుక్రవారం పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో ఇకపై మంజులను ఇబ్బంది పెట్టనని శంకర్ మాటిచ్చాడు. అదే రోజు రాత్రి, అక్క రాణి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా శంకర్ కత్తితో మంజుల గొంతు కోసి ఆమెను చంపేశాడు.భార్యను దారుణంగా చంపిన తర్వాత శంకర్ డోర్ పెట్టేసి అక్కడి నుంచి పారిపోయాడు.
తీవ్ర రక్తస్రావంతో మంజుల అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంజూల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. భర్త చేసిన పనితో పిల్లలు తల్లిదండ్రులు లేని వారయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: