మద్యం అనేక అనర్థాలకు దారితీస్తుందని మనకు తెలుసు. దానికి బానిసగా మారితే విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతారు. ఎన్నో కుటుంబాలు కేవలం మద్యం వల్ల విచ్చిన్నం అవుతున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా నష్టాలకు గురిచేస్తుంది. మద్యం (alcohol) మత్తులో చనిపోయిన వారెందరో ఉన్నారు. పిల్లలు అనాధలుగా మారుతున్నారు. అయినా ఈ మహమ్మారి నుంచి బయటకు పడలేకపోతున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ చెడు వ్యసనాలకు మహిళలు కూడా బానిసలుగా మారుతున్నారు. మద్యం మత్తులో భార్య, భర్తల మధ్య విబేధాలు భార్య చావుకు కారణమైంది. ఝార్ఖండ్ లోని (Jharkhand) పలాము జిల్లాలో దారుణం చటు చేసుకుంది.
Read also : UPSC: వందేళ్లు పూర్తి చేసుకున్న ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’

మద్యం మత్తులో ఉన్న భార్యాభర్తల మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో తన భార్యను ఎత్తి నేలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో పోలీసులు భర్తను అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఝార్ఖండ్ పలము జిల్లా రామ్ గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాతమ్ బడి ఝరియాలో ఉపేంద్ర పరియా (25), శిల్పిదేవి (22)లు నివసిస్తున్నారు. సోమవారం రాత్రి ఉపేంద్ర పరియా తన ఇంట్లో మద్యం మత్తులో ఉన్నాడు. అదే సమయంలో అతని భార్య శిల్పిదేవి కూడా మద్యం సేవించి ఇంటికి తిరిగి వచ్చింది.
ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వాదంతో హత్య
భార్య మద్యం తాగి ఇంటికి రావడాన్ని చూసి ఉపేంద్ర కోపంతో ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. వాగ్వాదం మరింత తీవ్రం కావడంతో ఉపేంద్ర ఆవేశంతో శిల్పిని కొట్టడం ప్రారంభించాడు. అనంతరం ఒక్కసారిగా ఆమెను పైకి ఎత్తివేసి, నేలపై బలంగా విసిరి కొట్టాడు. (Crime) తీవ్ర గాయాలపాలైన శిల్పిదేవి అక్కడిక్కడే మరణించింది. నిందితుడైన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఉపేంద్ర పరియా, శిల్పిదేవిలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఒక చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :