Crime ప్రేమను వ్యక్తం చేసే చిన్నిచిన్న మాటలే జీవితాలను నిలబెడుతుంది. కానీ ప్రేమ లేని చిన్న దెబ్బెపొడుపు మాటలు బతుకును బజారుకీడుస్తుంది. ఆ నష్టం మూల్యం చాలానే ఉంటుంది. జీవితాన్ని నిలబెట్టేది, పడగొట్టేది మాటే. మాటలకు అంతబలం ఉంది మరి. ఐబొమ్మ రవి (Ravi) విషయంలో ఇదే జరిగింది. రవి భార్య, అత్తమ్మలు కలిసి నిత్యం ‘నీకు డబ్బు సంపాదించడం రాదంటూ’ హేళన చేసేవారని తెలుస్తోంది. 2016లో రవి ఓ యువతిని ప్రేమించి, అనంతరం పెళ్లి చేసుకున్నాడు. భార్య ఉన్నత కుటుంబం నుంచి వచ్చింది. రవి మాత్రం అరకొర సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు.
Read Also: AP: ఉపాధి కల్పనే మా ప్రాధ్యానత : నారా లోకేష్

వెబ్ డిజైనర్ నుంచి పైరసీతో సంపాదన
అయితే ఇది నచ్చని అతని భార్య, ఆమె తల్లి రవిని ఎగతాళి చేస్తుండేవారు. డబ్బు సంపాదించడం చేత కాదంటూ నిత్యం వేధింపులకు గురిచేసేవారని తెలుస్తోంది. వెబ్ డిజైనర్ నుంచి పైరసీతో సంపాదన రవి వెబ్ డిజైనర్గా తన కెరీర్ను ఆరంభించారు. అనంతరం ఐబొమ్మ,(ibomma) బప్పం టీవీల రూపకల్పన చేశారు. వీటి నుంచి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదించి చూపించినా, అతనిలో కలిసి జీవించేందుకు భార్య ఇష్టపడలేదు.
దీంతో వీరిద్దరూ 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం రవి నెదర్లాండ్స్ కు తన మకాంను మార్చాడు. అక్కడ నుండి పైరసీ సినిమాలను విడుదల చేస్తూ కోట్లు సంపాదించాడు. ఇటీవలే ఓ బెట్టింగ్ యాప్ నుండి డబ్బులు తీసుకున్నాడు రవి. ఆ ఐపీ అడ్రస్ పై దర్యాప్తు చేసి ముసాపేటలోని (Musapeta) విస్టా అపార్ట్మెంట్ లో పోలీసులు నిఘాపెట్టారు. రెండురోజుల క్రితం ఫ్రాన్స్ నుండి ఇమ్మడి రవి తిరిగి రాగానే, పక్కా సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇమ్మడి రవితోనే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్లను (Websites) పోలీసులు క్లోజ్ చేయించారు. తన వద్ద కోట్ల మంది డేటా ఉందని, నా వెబ్ సైట్ లపై ఫోకస్ చేయడం ఆపండి అని గతంలో రవి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: