అసలే కర్నూలు వద్ద ఇటీవల ఓ ప్రైవేటు బస్సు దగ్ధంలో 20మంది మరణించారు. ఆ విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే మరో ప్రమాదం జరిగింది. రాజస్థాన్లోని జైపూర్ జిల్లా మనోహర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లా నుంచి కూలీలను
తీసుకుని రాజస్థాన్ లోని ఇటుక బట్టీల వద్దకు బయలుదేరింది. బస్సు డ్రైవర్ టోల్ గేట్ ఫీజు (రూ.100) ఆదా చేయడానికి హైవే కాకుండా పక్క దారిలో, మురికి రోడ్డులో బస్సును మళ్లించినట్లు సమాచారం. ఆ దారిలో ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్న 11,000 వోల్టుల హైటెన్షన్ విద్యుత్ తీగకు బస్సు పై కప్పుపై ఉన్న సామగ్రి తగిలింది. బస్సు పైభాగంలో ఉన్న లోహపు లగేజీ బాక్సులు, కొన్ని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు విద్యుత్ తీగకు తగలడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి, పెద్ద పేలుడు సంభవించింద. క్షణాల్లో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది.
Read also: Kurnool Accident:కర్నూలు బస్సు ప్రమాదం – డ్రైవర్ లక్ష్మయ్య అరెస్ట్

Crime: కూలీలతో వెళ్తున్న బస్సుకు మంటలు..
మంటలు వ్యాపించగానే ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ కిటీకీల నుంచి బయటకు దూకారు. ప్రయాణీకుల్లో చాలామంది తప్పించుకున్నారు. కొందరు లోపలే చిక్కుకుపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా? పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. టోల్ ఫీజును తప్పించుకోవాలని డ్రైవర్ చేసిన నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డ్రైవర్, కండక్టర్తో పాటు, కూలీలను రవాణా చేసిన ఇటుక బట్టీ యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మితిమీరిన వేగం
ఈ ఘటనలో పిలిఖిత్ కు చెందిన కూలీ నసీమ్ (50), అతని కూతురు సాహినమ్ (20) తీవ్రంగా కాలిపోయి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. నసీమ్ భార్య నజ్మా సహా మరో పదిమందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల ప్రమాదాలు అధికం అవుతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడపడమే కాక మద్యం మత్తులో కూడా ప్రమాదానికి కారణాలుగా నిలుస్తున్నాయి. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి కారణం అవుతున్నది. చిన్నపాటి జాగ్రత్తలు విలువైన జీవితం హాయిగా సాగేందుకు దోహదం చేస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: