బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty), ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి వార్తల్లో నిలిచారు. వ్యాపార ఒప్పందాల పేరుతో ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేరకు మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో శిల్పా–రాజ్ దంపతులు నిందితులుగా ఉన్నారు.
Mass Jathara Movie: మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ విడుదల
ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (Mumbai Police’s Economic Offences Wing) విచారిస్తోంది. కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై ఆర్థిక నేరాల విభాగం (EOW) అధికారులు ఇటీవలే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.
విచారణ జరిపిన కోర్టు శిల్పా శెట్టికి షాక్
దీంతో వారు విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్, లేదా దర్యాప్తు అధికారుల అనుమతి తప్పనిసరి.ఈ నేపథ్యంలో శ్రీలంక (Sri Lanka) వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ శిల్పా శెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 25 నుంచి 29 వరకూ కొలంబోలో జరిగే ఓ యూట్యూబ్ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లాలని.. అందుకు అనుమతి ఇవ్వాలని శిల్పా తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు శిల్పా శెట్టి (Shilpa Shetty) కి షాక్ ఇచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. విదేశీ ప్రయాణ అనుమతి కోరేముందు రూ.60 కోట్లు చెల్లించండి అంటూ వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.
శిల్పా శెట్టి ప్రొఫెషనల్ పరంగా సినిమాలతో పాటు బిజినెస్ రంగంలో కూడా చురుకుగా ఉంటూ వస్తున్నారు. ఫిట్‌నెస్, వెల్‌నెస్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టిన ఆమె ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ కేసు ఫలితం రాబోయే రోజుల్లో శిల్పా దంపతుల ఇమేజ్‌పైన ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: