కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులోని పోలీస్ కమిషనరేట్ (Police Commissionerate) కార్యాలయం ఎదుట గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్ళిన పోలీస్ కానిస్టేబుల్(Constable)ను గుర్తు తెలియని కారు వెనక నుంచి ఢీకొట్టి (Collision) తీవ్రంగా గాయపరిచింది.

కోహెడ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వేణు గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి తిరిగి సిద్దిపేటకు వెళ్లున్న క్రమంలో కమిషనర్ ఆఫీస్ బయటకు రాగానే తన వెనుకాలే వచ్చిన కారు వెనక నుంచి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో కానిస్టేబుల్ రోడ్డు పై పడిపోయాడు. ప్రమాద అనంతరం కారు డ్రైవర్ తన కారును ఆపకుండా బైక్‌ను 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లి రోస్ రెస్టారెంట్ వద్ద వదిలి వెళ్లి పోయింది. 108 వాహనంలో క్షతగాత్రుడిని సిద్దిపేట ఏరియా దవాఖానకు తరలించారు.
ప్రమాదానికి కారణమైన వాహనం పరారీలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన రోడ్డు భద్రతా చర్యలపై మరింత కఠినతను అవసరాన్ని ప్రతిబింబిస్తుంది.
Read Also:http://Gautam Adani: పన్నుల చెల్లింపులో రికార్డు సృష్టించిన అదాని