Husband wife dispute: వివాహేతర సంబంధం అనుమానంతో ఓ భార్య చేసిన దారుణ చర్య తీవ్ర సంచలనం రేపింది. అస్సాంకు చెందిన బిదాన్ (33) తమిళనాడులోని కోయంబత్తూరు (coimbatore crime)లో ప్లంబర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానం రావడంతో అతడి భార్య జిండి (36) ఇటీవల కోయంబత్తూరు వచ్చి భర్తను నిలదీసింది. 4రోజుల క్రితం, భర్త ఇంట్లోకి మరో మహిళను తీసుకురావడంతో జిండి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
Read also: Mysore Explosion: అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి
భర్తపై కత్తితో దాడి
ఈ క్రమంలో మద్యం సేవించి నిద్రిస్తున్న భర్తపై కత్తితో దాడి చేసి అతడి మర్మాంగాన్ని తీవ్రంగా గాయపరిచింది. అనంతరం అక్కడి నుంచి పరారైంది. తీవ్ర రక్తస్రావంతో బిదాన్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం బిదాన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి జిండి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలు సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన కోయంబత్తూరు(coimbatore crime)లో చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: