చిత్తూరు జిల్లా లో బుదవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పలమనేరు నియోజకవర్గం. గంగవరం మండలం వైయస్సార్ జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం లో కర్ణాటక వాసులు మృతి చెందారు. బెంగుళూరు నుండి తిరుమలకు వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. పలమనేరు వద్ద సిమెంట్ లోడ్ వదిలేసి కర్నూలు వైపు వెళ్లుతున్న లారీ సిమెంట్ లారీని వెనుక వైపు నుంచి ఢీకొన్న కారు సంఘటనా స్థలంలోని ఐదు మంది మృతి వారిలో ముగ్గురు మహిళలు ఇద్దరు మగవాళ్ళ ఉన్నారు.
Read Also:Chittoor Road Accident: కంటైనర్ లారీని ఢీకొట్టిన కారు.. 5గురు దుర్మరణం

మృతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం రాజాజీ నగర్ కు చెందిన వారుగా గుర్తించారు.
బంధువులు కు సమాచారం ఇచ్చిన పలమనేరు పోలీసులు
మృతుల వివరాలు
1) మోహన్ దాస్ ( 71 )
2) నాగరాజరావు, ( 61)
3) కుసుమ 61
4) జయంతి 59
5) పూజ 33
వారంత బెంగళూరు నుండి తిరుమల కు వస్తున్నారు.

జిల్లా ఇన్ చార్జీ మంత్రి ప్రమాదంపై దిగ్భాంతి
చిత్తూరు జిల్లా, గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా. ప్రమాద వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి. అధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటనపై ఆరా తీసిన మంత్రి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచన. ప్రమాద కారణాలపై వివరాలు తెలుసుకున్న మంత్రి.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ.
ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
గంగవరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: