ఆకలి వేసినప్పుడు హోటల్ కు వెళ్లి, ఇష్టమైనవి తిని బిల్లు చెల్లించి వస్తాం. రంగురంగుల ఆహారపదార్థాలను చూసి, నోరు ఊరిపోతుంది. హోటల్ బయట బోర్డులను చూసి, ఏమాత్రం అనుమానం లేకుండా ఫుడ్ ఆర్డర్ చేస్తాం. వారు తెచ్చింది ఏమాత్రం అందులో ఏమి కలి
పారో గ్రహించకుండానే తినేస్తుంటాం. చికెన్ అని ఆర్డర్ చేస్తే, నిజంగానే చికెన్ తెస్తారు. కానీ ఆ చికెన్ ఎప్పటిది? అందులో చికెన్ తో పాటు ఇతర జంతువుల మాసం ఉందా? అని ఆలోచించం. ఇలా మన ఇష్టాలనే కొందరు ముఠాగా ఏర్పడి దండుకుంటున్నారు. ఇంతకీ చెప్పాల్సిన విషయం ఏమిటంటే ‘చిల్లీ చికెన్’ పేరుతో గబ్బిలాలను అమ్ముతున్న ముఠాను పోలీసులు చేధించారు.

చిలి చికెన్ స్కామ్
తమిళనాడులోని సేలం జిల్లాలో అటవీ ప్రాంతంలో తుపాకులతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని విచారించగా..వారు దిగ్భ్రాంతికరమైన విషయాలను చెప్పారు. గబ్బిలాలను వేటాడి, వాటి మాంసాన్ని ‘చిల్లీ చికెన్’ (Chili Chicken) పేరుతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ గబ్బిలాల వేట ముఠా అరెస్టుతో తమిళనాడులో చిల్లీ చికెన్ స్కామ్ (Chilli Chicken Scam) గుట్టు రట్టయింది. కొన్నినెలలుగా ఈ దారుణమైన పనులు పోలీసుల విచారణలో సెల్వం, కమల్ అనే నిందితులు గత కొన్ని నెలలుగా ఈ దారుణమైన పని చేస్తున్నట్లు అంగీకరించారు. గబ్బిలాలను చంపి, వాటిని చిన్న ముక్కలుగా కోసి, చికెన్క బదులుగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా కొందరు ఇలాగే చేస్తున్నారని నిందితులు వెల్లడించడంతో అధికారులు అవాక్కయ్యారు.
అప్రమత్తమైన ఆహార భద్రతా అధికారులు
ఈ ఉదంతం వెలుగు చూడడంతో పోలీసులు, ఆహార భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై తనిఖీలకు సిద్ధమవుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యం, ఆహార భద్రతపై తీవ్రప్రభావం చూపే అంశం కావడంతో, పోలీసులు ఈ గబ్బిలాల మాంసం కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
గబ్బిలం అసలు పేరు ఏమిటి?
గబ్బిలాలు చిరోప్టెరా క్రమానికి చెందిన క్షీరదాలు, ఇది గ్రీకు మూలానికి చెందిన పేరు, దీని అర్థం “చేతి-రెక్క”, ఇది జంతువు యొక్క అత్యంత అసాధారణ శరీర నిర్మాణ లక్షణాన్ని ఖచ్చితంగా వివరిస్తుంది.
గబ్బిలం ఎందుకు ఒక ప్రత్యేక జంతువు?
గబ్బిలాలు మాత్రమే వాస్తవానికి ఎగురుతున్న క్షీరదాలు, అవి ఎగరడానికి రెక్కలు ఆడిస్తూ ఎగురుతాయి. ఎగిరే ఉడుతలు వంటి కొన్ని క్షీరదాలు ఎగరడానికి బదులుగా జారుతూ మాత్రమే ఉంటాయి. గబ్బిలాలు ప్రత్యేకమైనవి కాబట్టి వాటిని చిరోప్టెరా అని పిలువబడే వాటి స్వంత ప్రత్యేక క్షీరదాల క్రమంలో వర్గీకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Chidambaram: పహల్గామ్ ఉగ్రదాడిపై చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు