డెలివరీ బాయ్ ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకుని, గుట్టుచప్పుడు కాకుండా మనేజ్ చేశాడు. కానీ చివరికి అసలు రహస్యం తెలిసిపోయింది. ఇద్దరు భార్యలు పోలీసులను ఆశ్రయించారు. ఒకే నెలలో ఇద్దరు మహిళలను వివాహం చేసుకుని, ఏడాది పాటు రహస్యంగా కాపురం చేసిన ఓ వ్యక్తి బండారం చివరకు బట్టబయలైంది. ఇద్దరు భార్యలు ఏకమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని ఆరెస్టు చేశారు.
Read Also: Robin Uthappa: ఐపీఎల్ వేలం రద్దు చేయాలంటూ రాబిన్ ఊతప్ప విజ్ఞప్తి

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని (Uttar Pradesh) ప్రయాగ్ రాజ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, స్థానిక డెలివరీ కంపెనీలో పనిచేసే రామకృష్ణ దూబే అలియాస్ రాహుల్, 2024 నవంబరులో తన ప్రియురాలు ఖుష్బూను ప్రేమ వివాహం చేసుకున్నాడు. సరిగ్గా నెలరోజులు తిరిగేలోపే, కుటుంబ సభ్యులు కుదిర్చిన శివంగి అనే మరో యువతిని పెళ్లాడాడు. డెలివరీ బాయ్ ఉద్యోగం కావడంతో ఎక్కువ సమయం బయటే ఉంటూ, ఇద్దరు భార్యలకు అనుమానం రాకుండా ఏడాదిపాటు రెండు కాపురాలను నెట్టుకొచ్చాడు.
ఒక్క ఫోన్ కాలు తలకిందులు చేసిన వైనం..
ఈ క్రమంలోనే మొదటి భార్య ఖుష్బూకు ఆడబిడ్డ జన్మించింది. ఒకరోజు ఖుష్బూ తన భర్తకు ఫోన్ చేయగా, అనుక్కోకుండా రెండో భార్య శివంగి ఆ ఫోన్ ను లిఫ్ట్ చేసింది. తను రామకృష్ణ భార్యనని ఖుష్ఫూ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో ఖుష్బూ తన పెళ్లి ఫోటోలను శివంగికి పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు భార్యలు ఒకటై స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రామకృష్ణను అరెస్టు చేసి, జైలుకు పంపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: